ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ గన్ ఉండాలి: ఎమ్మెల్యే రాజా సింగ్

కలం, వెబ్ డెస్క్: హిందువుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్ ఉన్న తుపాకులు ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగితే హిందువులకు రక్షణ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘హమ్ దో హమారే దో’ (ఇద్దరు పిల్లల నిబంధన) చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో ప్రతి హిందూ కుటుంబం ఆత్మరక్షణ కోసం లైసెన్స్‌డ్ గన్స్ కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే 20 ఏళ్లలో ముస్లింల జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఒక ప్రముఖ పత్రికలో కథనం వచ్చిందని రాజా సింగ్ ప్రస్తావించారు. జనాభా సమతుల్యత దెబ్బతింటే భవిష్యత్తులో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు తలెత్తితే హిందువుల ఆస్తులకు, ఆడపడుచులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, బలవంతపు మతమార్పిడుల వంటి పరిస్థితులు ఇక్కడ కూడా మొదలయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల, ఉత్తరప్రదేశ్ తరహాలోనే దేశవ్యాప్తంగా హిందువులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేసి, వారి వద్ద లైసెన్స్‌డ్ తుపాకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>