కార్తీక పౌర్ణమి రోజు 7 రకాల దానాలు.. ఏది అత్యంత శ్రేష్ఠమో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మరెంతో విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున ఆచరించే పవిత్ర స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు కోటిరెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయని హిందూ ధర్మ శాస్త్రాల నమ్మకం. వీటితో పాటు కార్తీక పౌర్ణమి రోజున చేసే దానాలకు (Kartika Purnima Donations) కూడా ఎంతో విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు కార్తీక పౌర్ణమి రోజున ఏయే వస్తువులు దానం చేయాలి? దానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2026వ సంవత్సరంలో నవంబర్ 24వ తేదీ, మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు ఏయే దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన దానాలు ఇవే:

1. దీపదానం: పిండితో లేదా మట్టితో చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి, వత్తులు వేసి వెలిగించి బ్రాహ్మణుడికి లేదా ఆలయంలో దానం ఇవ్వాలని చెబుతున్నారు. దీనివల్ల అజ్ఞానం తొలగి, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం.

2. అన్నదానం: దానాలలోకెళ్లా అన్నదానం ఉత్తమమైనదని మనందరికి తెలుసు. అయితే కార్తీక పౌర్ణమి రోజున ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది, సకల పాపాలు నశిస్తాయని నమ్మకం.

3. స్వయంపాకం దానం: స్వయంపాకం దానం అంటే వండిన ఆహారం కాకుండా బియ్యం, పప్పు, కూరగాయలు, నెయ్యి, చింతపండు, దక్షిన కలిపి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవచ్చట.

4. ఉసిరికాయ దానం: పురాణాల ప్రకారం.. కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడని నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయలను దానం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని చెబుతున్నారు పండితులు.

5. వస్త్ర దానం: కార్తీక మాసం అంటే చలికాలం ప్రారంభం అయ్యే సమయం. కావున ఈ సమయంలో పేదలకు దుప్పట్లు, కొత్త బట్టలు దానం చేయడం అత్యంత పుణ్యప్రదమని చెబుతున్నారు.

6. గోదానం లేదా భూదానం లేదా సువర్ణ దానం: ఆర్థిక స్తోమత ఉన్నవారు వీటిని దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్ర వచనం.

7. జలదానం: దాహంతో ఉన్నవారికి మంచి నీరు అందించడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా ఆలయాలలో నీటి వసతి కల్పించడం వంటి కార్యక్రమాలు చేయడం మంచిదని చెబుతున్నారు.

అయితే కార్తీకపౌర్ణమి నాడు చేసే దానాలలోకెల్లా దీపదానం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారని చెబుతున్నారు అధ్యాత్మిక నిపుణులు. ఇక్కడ మనం దానం చేయడం ఎంత ముఖ్యమో, దానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా, ఎటువంటి అహంకారం లేకుండా శ్రీమహావిష్ణువు, పరమశివుని ప్రీత్యర్థం అని భావిస్తూ ఇస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుందట.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం హిందూ మత సంప్రదాయాలు, పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని ఆచరించడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విశ్వాసం, సంప్రదాయం, ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>