కలం, వెబ్ డెస్క్ : మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)కి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. నవంబర్ 23వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో భేటీ కావాలని సూచించింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డికి తెలియజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : కరీంనగర్ గడ్డపై కాషాయ కదనం.. గులాబీ సమరం!
Follow Us On : WhatsApp

