గద్వాల ప్రభుత్వ కళాశాలలో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు

కలం, జోగులాంబ గద్వాల: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. వీరన్న పిలుపునిచ్చారు. శనివారం గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘ఈగల్ ఫోర్స్ తెలంగాణ’ (Eagle Force Telangana) అవగాహన పోస్టర్‌ను ప్రిన్సిపాల్ అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు వ్యసనం వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సరైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, యోగా, ధ్యానం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. వ్యసన బాధితులను నిందించకుండా వారికి అండగా నిలిచి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున్, కలీముల్లా, పవన్ కుమార్, గండిచెరువు శేఖర్, సుతారి గోపి, నర్సింహులు, వీరేష్, సామల వెంకటేష్, ఈరేశం, సృజన, గీత, సుజాత, అంజనమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>