కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Prakasam Road Accident) చోటుచేసుకుంది. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో కారు డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి ఉన్నారు. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

