భైంసాలో దారుణం.. భార్యను చంపిన భర్త

కలం, భైంసా: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన (Bhainsa Murder) భైంసా పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ష అలియాస్ ఫాతిమా (28), భీమ్ అలియాస్ షాహిద్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని సేవాలాల్ చౌక్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో వర్షపై భీమ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న భైంసా ఏఎస్పీ సాయికిరణ్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ఘటనా (Bhainsa Murder) స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>