కన్హా శాంతివనంలో అంతర్జాతీయ హోమియో సదస్సు

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనం (Kanha Shanti Vanam)లో నేడు, రేపు అంతర్జాతీయ హోమియోపతి సదస్సు  జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. జిమ్స్ (JIMS) హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న హోమియోపతి వైద్యులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి 1,400 మందికిపైగా వైద్యులు, పరిశోధకులు హాజరుకానున్నారు. అంతేకాకుండా ఐదు విదేశీ దేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటుండటం విశేషం. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో హోమియోపతి వైద్య విధానాలు, నూతన పరిశోధనలపై నిపుణులు లోతుగా చర్చించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>