‘AI డేటా’ కంపెనీలకు ట్రంప్​ వార్నింగ్​

కలం, వెబ్​ డెస్క్​: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా కంపెనీలకు (AI Data Companies) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ (Donald Trump) హెచ్చరించాడు. విదేశాలలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే భారీ పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. ఆసియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను “సూపర్ ఇంటెలిజెన్స్” అని పిలిచే దాని అభివృద్ధిలో చైనా కంటే యూఎస్​ ముందుందన్నారు.

అయితే, ఏఐ విప్లవానికి కీలకంగా ఉన్న డేటా సెంటర్ల అభివృద్ధికి రాజకీయ వ్యతిరేకత అడ్డుకట్ట వేస్తే.. వెనుకబడిపోయే ప్రమాదం ఉందన్నారు. దీని కారణంగా ఇతర దేశాలలో డేటా సెంటర్లను నిర్మించడానికి కంపెనీలకు అనుమతివ్వబోమని ట్రంప్​ స్పష్టం చేశారు. ఒకవేళ విదేశాల్లో కంపెనీలు పెట్టాలనుకుంటే భారీ పన్నులు విధిస్తామని హెచ్చరించారు. విదేశాల్లో డేటా సెంటర్లు పెడితే చైనా వాటన్నిటినీ తీసుకెళ్లిపోతుందని ట్రంప్ (Donald Trump)​ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>