శంకరంపేట్‌లో ఇందిరమ్మ బీమా పత్రాల పంపిణీ!

క‌లం, మెద‌క్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని (Indiramma Insurance) అమలు చేస్తోందని నార‌య‌ణ ఖేడ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజీవ రెడ్డి తెలిపారు. శంకరంపేట్ మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పథకానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించి, ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>