కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి (Chinna Reddy) పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా మరింత ఇబ్బందులు పెట్టేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని వివరించారు.
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని.. ఆయన అవినీతి రూ.లక్ష కోట్లు దాటిందని చిన్నారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్డగోలుగా భూములు దోచుకుంటున్నారని ఆ పోస్టులో రాశారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశం కాగా.. అది ఫేక్ అంటూ చిన్నారెడ్డి అధికారిక వివరణ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు చిన్నారెడ్డి ఫిర్యాదు చేస్తారనే చర్చ జరుగుతోంది.

