వేతనంలో మెస్సీ టాప్‌.. లెవాండోస్కీకి రెండో స్థానం!

కలం, స్పోర్ట్స్ : ఎంఎల్ఎస్‌లో మెస్సీ (Lionel Messi) జోరు కొనసాగుతోంది. అత్యధిక హామీ వేతనం పొందుతున్న ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా స్టార్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆయనకు 28.3 మిలియన్ డాలర్ల హామీ వేతనం అందుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 8 మిలియన్ డాలర్లు ఎక్కువ. ఈ జాబితాలో రాబర్ట్ లెవాండోస్కీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన వేతనం 19.51 మిలియన్ డాలర్లు. ఆంటోయిన్ గ్రీజ్‌మన్ 13.93 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. సన్ హ్యూంగ్-మిన్ 11.15 మిలియన్ డాలర్లు, బ్రీల్ ఎంబోలో 10.81 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

జట్టు ఖర్చుల్లోనూ ఇంటర్ మయామిదే టాప్‌

ఆటగాళ్లకు చెల్లించే మొత్తం వేతనాల విషయంలోనూ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు ఆటగాళ్ల హామీ వేతనాల మొత్తం 59.37 మిలియన్ డాలర్లు. చికాగో ఫైర్ 41.29 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అట్లాంటా, ఎల్‌ఏ గెలాక్సీ, ఎల్‌ఏఎఫ్‌సీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు ఫిలడెల్ఫియా యూనియన్ ఆటగాళ్ల వేతనాల మొత్తం 12.64 మిలియన్ డాలర్లతో అత్యల్పంగా ఉంది. స్పోర్టింగ్ కాన్సాస్ సిటీ 13.30 మిలియన్ డాలర్లు, డీసీ యునైటెడ్ 14.55 మిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>