కలం, జోగులాంబ గద్వాల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కేటిదొడ్డి గ్రామంలో తహసీల్దార్ కరుణాకర్ (Tahsildar Karunakar), మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ కుర్వ హన్మంతు, గ్రామ సర్పంచి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కరుణాకర్ బీమా పత్రాలను లబ్ధిదారులకు అదించి మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, ఇంటి పెద్దకు అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం ఈ పథకం ఉద్దేశమని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కరుణాకర్ సూచించారు. మొదటి దశలో మండలంలో ఎనిమిది గ్రామాల్లో పథకం ప్రారంభించినట్లు తెలిపారు. మండల అధ్యక్షుడు ఉరుకుందు, ఉప సర్పంచి పెద్ద వీరన్నగౌడ్, ఎంపీడీవో రమణరావు, ఎంపీవో రామన్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు యుగంధర్ గౌడ్, కొండయ్య, వీరేష్, పాల్గొన్నారు.

