సిరాజ్‌పై మతం రంగు.. గంభీర్ కోచ్ స్ట్రాంగ్ కౌంటర్!

కలం, స్పోర్ట్స్ : మహమ్మద్ సిరాజ్‌ను (Mohammed Siraj) తొలి టెస్టుకు ఎంపిక చేయకపోవడంపై మతపరమైన ఆరోపణలు రావడం వివాదానికి దారితీసింది. ఈ ఆరోపణలను గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ (Sanjay Bhardwaj) తీవ్రంగా ఖండించాడు. జట్టు ఎంపికలో మతానికి చోటు లేదని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు కూర్పు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేశారు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌తో కలిసి కాంబోజ్ బరిలోకి దిగాడు. సిరాజ్‌ను రిజర్వ్ ఆటగాళ్లలో ఉంచారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అనుమానాలు వ్యక్తం చేశాడు.

మంచి ప్రదర్శన చేస్తున్నా సిరాజ్‌(Mohammed Siraj)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతడి పేరు కారణంగానే పక్కన పెట్టారా అంటూ మతపరమైన కోణాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ వ్యాఖ్యలపై భరద్వాజ్ స్పందించాడు. గంభీర్ ఎప్పుడూ సిరాజ్‌కు మద్దతుగా ఉంటాడని చెప్పాడు. ఏ ఆటగాడిపైనా అతడికి వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశాడు. బలమైన జట్టును నిర్మించడమే గంభీర్ లక్ష్యమని పేర్కొన్నాడు. మరోవైపు, భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా ఎంపికను సమర్థించాడు. కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ అత్యుత్తమ జట్టు కూర్పును ఎంచుకున్నారని తెలిపాడు. దీంతో సిరాజ్ ఎంపికపై వివాదం కొనసాగుతోంది.

Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరేంటంటే?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>