పత్తి చేనులో నక్కిన 70 కిలోల పైథాన్.. చాకచక్యంగా పట్టివేత!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం నేరడ (Nerada) గ్రామ రెవెన్యూ పరిధిలో శుక్రవారం భారీ కొండచిలువ (పైథాన్) కలకలం సృష్టించింది. పత్తి చేనులో నక్కి ఉన్న సుమారు 70 కిలోల బరువున్న ఈ భారీ పైథాన్‌ను అటవీ శాఖ సిబ్బంది చాకచక్యంగా, సురక్షితంగా పట్టుకోవడంతో గ్రామస్థులు, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. ​శ్రీ గంగమ్మ గుడి సమీపంలోని ఓ రైతు పత్తి చేనులో కూలీలు పత్తి తీస్తుండగా ఒక్కసారిగా భారీ పైథాన్ కనిపించడంతో వారు హడలిపోయారు. భయంతో పనులు వదిలి చేను నుంచి బయటకు పరుగులు తీశారు.

వెంటనే గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీకి సమాచారం అందించగా, ఆయన స్పందించి అటవీ శాఖ సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. ​హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది.. గ్రామ పంచాయతీ కార్యదర్శి, కూలీలు, స్థానికుల సహకారంతో చేనులోని కొండచిలువను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏదైనా జంతువును ఆహారంగా తీసుకుని ఉండవచ్చని, విశ్రాంతి కోసం పత్తి చేనులోకి చేరి ఉండవచ్చని అటవీ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో సర్పంచ్ దూసరి నేతాజీ చొరవ, అటవీ సిబ్బంది అప్రమత్తత, స్థానికుల సహకారం కీలకంగా నిలిచాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>