బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలి: కలెక్టర్

కలం, నిర్మల్: పదవతరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్ పేట్‌లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా పదవతరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తయిన పాఠాలన్నీ ఎప్పటికప్పుడు చదువుకొని ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉండాలన్నారు.

బోర్డుపై విద్యార్థులచే గణితానికి సంబంధించి లెక్కలను చేయించారు. లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి వారికి పెన్నులను బహుకరించారు. చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకుముందు పాఠశాల కార్యాలయంలో అన్ని రకాల రిజిస్టర్లను, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు ఆన్ లైన్ లో పరిశీలించారు. పాఠశాలలో క్రమం తప్పకుండా పూర్తిస్థాయి హాజరు ఉండాలన్నారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులను గుర్తించి, కార్డులు ఇప్పించేలా, అవసరమైన వారి వివరాలు అప్డేట్ చేసేలా చొరవ చూపాలన్నారు. యూడైస్ వివరాలు పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంఈవో పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ ఎప్పుడొస్తారంటే!.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>