పుస్తక పఠనంతో జ్ఞానం, ఆలోచనా శక్తి పెంపొందుతాయి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఆదిలాబాద్: గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, పుస్తక పఠనం మనిషిలో జ్ఞానంతో పాటు ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని సందర్శించి పాఠకులకు అందుతున్న సౌకర్యాలు, గ్రంథాలయ సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మల్లెపూల నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>