అసెంబ్లీ పెట్టు రేవంత్.. ఆధారాలతో సహా రుజువు చేస్తా: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ నీటి వినియోగంపై రేవంత్  సర్కార్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను కరువుకాటకాల్లోకి నెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఒడిసిపట్టాల్సిన నీళ్లన్నీ, ఆంధ్రాకు ధారాదత్తం చేశారని.. నేడు రాష్ట్రం కరువుకోరల్లో చిక్కుకుపోవడానికి కారణం రేవంత్ సర్కారేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుతం అన్ని రంగాలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ నేతల భూ కబ్జాలు, దందాలు తప్ప.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.

అసెంబ్లీలో బట్టలిప్పి నిలబెడుతా..

ఈ అంశంపై అసెంబ్లీలో ఎన్నిరోజులైనా చర్చించేందుకు సిద్ధమని.. సభ 3 రోజులు పెడుతవా? 4 రోజులు పెడుతవా? పెట్టు చర్చించేందుకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మైక్ కట్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలని అన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని బట్టలిప్పి నిలబెట్టకుంటే తనపేరు హరీశ్ రావు (Harish Rao) కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయిందో ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. తెలంగాణకు నీళ్ళు ఎత్తే అవకాశమున్నా, ఎత్తకుండా రాష్ట్రం ప్రజానీకానికి ఎలా ద్రోహం చేశావో.. కరువు ఎలా తీసుకొచ్చావో ఆధారాలతో సహా రుజువు చేస్తానని విమర్శించారు.

ఓట్లతో రేవంత్ రెడ్డిని తొక్కే రోజు దగ్గర్లోనే..

రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ అంటూ హరీశ్ రావు పంచులు వేశారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అంటూ దుయ్యబట్టారు. సిద్ధిపేట సభలో కేవలం గంట ప్రసంగంలోనే తన పేరు, కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు 140 సార్లు ఉచ్చరించాడని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఓట్లతో రేవంత్ రెడ్డిని తొక్కే రోజు దగ్గర్లోనే ఉందని విమర్శించారు.

పాలమూరుకు ద్రోహం చేసిందే కాంగ్రెస్, చంద్రబాబు..

ఉమ్మడి మహబూబ్ నగర్ వరప్రదాయిని అయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మూడు దశాబ్దాల పాటు పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా బీఆర్ఎస్ మార్చి.. సాగు, తాగునీటి కష్టాలను తీర్చిందని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి మహబూబ్​నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాలని గుర్తుచేశారు.

చంద్రబాబు నీళ్ల పండుగ.. రేవంత్ క్రాప్ హాలిడే..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుండి కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అర్థ కిలోమీటర్ కాలువ కూడా రేవంత్ రెడ్డి తవ్వలేడని విమర్శించారు. 50 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జారవిడిచిందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నీళ్ల పండుగ చేస్తుంటే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి నీళ్ళు ఇవ్వకపోగా క్రాప్ హాలిడే ఇచ్చాడని విమర్శించారు.

Also Read : వాళ్లకు దోచిపెట్టడమే మోదీ పని: ఖర్గే

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>