వాళ్లకు దోచిపెట్టడమే మోదీ పని: ఖర్గే

కలం, వెబ్ డెస్క్: దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టడమే ప్రధాని మోదీ (PM Modi) అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా విమర్శించారు. చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారులను సర్వనాశనం చేశారన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆర్థిక సంస్కరణలకు చిరునామా. యూపీఏ హయాంలో దేశంలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రధాని మోదీ ఎప్పటిలాగే ఫిక్కీ సదస్సులో వ్యాపారవేత్తల ముందు అలవాటుగా అబద్ధాలు చెప్పేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమాన అవకాశాలతో పోటీ ఉండాలని భావిస్తుంటుంది. కానీ, మోదీ ప్రభుత్వ మాత్రం ఒకరిద్దరికే దేశ సంపదను దోచుకునే అవకాశం కల్పిస్తోంది. ఆరోగ్యకరమైన పోటీ లేకపోవడంతోనే ఆవిష్కరణలు కుంటుపడిపోయాయి. తయారీ రంగంలో నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నది. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో భారతీయ వస్తువులకు తగిన గిరాకీ కూడా లేకుండా పోయింది” అని ఖర్గే విమర్శించారు.

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం..

దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం తాండవిస్తున్నాయని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారు. మేకిన్ ఇండియా (Make in India) కాస్తా చైనా నుంచి కొనుక్కోవడంలా మారిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థను కొంత మంది వ్యాపారవేత్తల గ్రూప్ నియంత్రించేలా బీజేపీ ప్రభుత్వం పక్కాగా పనిచేస్తోంది. దీని కారణంగా ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో పాటు ఆర్థిక విధ్వంసం కూడా జరుగుతోంది’ అని ఖర్గే తీవ్ర స్థాయిలో మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

Also Read : ప్రాజెక్టు చీతాలో మరో మైలురాయి.. 4 కూనలకు జన్మనిచ్చిన చిరుత!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>