ఖమ్మం జీజీహెచ్‌లో బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్) (Khammam GGH) లో ఓ బాలింత మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

​బాధితుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన రత్నకుమారి (36) ఏడు నెలల గర్భిణి. ప్రసవం కోసం ఈ నెల 17న ఆమెను ఖమ్మం జీజీహెచ్‌లో చేర్పించారు. 18వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స (సిజేరియన్) నిర్వహించగా, ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చారు. ​నెలలు నిండకముందే పుట్టడంతో తక్కువ బరువుతో ఉన్న ఆ పసికందుకు వైద్యులు ప్రస్తుతం ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే, శస్త్రచికిత్స జరిగిన తర్వాత బాలింత రత్నకుమారి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.

​తల్లి మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి అధికారులు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>