కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 275 ఎస్సై (సివిల్) తత్సమాన పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జులై 29, 2026న విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్షను ఈ నెల 29వ తేదీ నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 335 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్ (http://tgprb.in](http://tgprb.in) లోకి వెళ్లి తమ వ్యక్తిగత అకౌంట్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను పొందాలని బోర్డు సూచించింది.
ఒకవేళ ఎవరైనా అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది. అలాంటి వారు support@tslprb.in కు ఈ-మెయిల్ పంపడం ద్వారా గానీ, లేదా 040-41895151 ఫోన్ నంబర్ ద్వారా గానీ సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని TSLPRB అధికారులు పేర్కొన్నారు.
Also Read : తెలంగాణకు క్రిస్టియానో రొనాల్డోను తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

