ఏపీలో హై అలర్ట్.. ఎంపీ కాన్వాయ్​ పై పెట్రోల్​ బాంబ్ దాడి!

కలం, వెబ్ డెస్క్​: ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో నామినేషన్ల కార్యక్రమానికి వెళ్తుండగా దాడి జరిగింది. శుక్రవారం కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు వద్ద ఎంపీ కాన్వాయ్‌పై దుండగులు పెట్రోల్ బాంబులతో పాటు రాళ్లు విసిరారు. వైసీపీ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారనే అక్కసుతో ఈ దాడికి పాల్పడినట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడి చేయడంతో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల అర్బన్ పీఎస్ వెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read : పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కత్తితో వ్యక్తి హంగామా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>