కలం, వెబ్ డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి మరోసారి శుభవార్త అందుతోంది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం, నవంబర్ 20వ తేదీన (Gold Rate Today).. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 5,300 తగ్గి, రూ. 1,27,900కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల ధర రూ. 4,700 తగ్గి.. రూ,1,15,100కి చేరింది. ఈ క్రమంలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి రూ.1,54,680కి చేరింది.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం ధరలు ఇలా వరుసగా తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇతర కరెన్సీలలో బంగారం కొనుగోలు ఖరీదై. డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్పల్ప తేడాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read : ఇన్సూరెన్స్ లేకపోతే రూ.10 వేలు ఫైన్.. NHAI క్లారిటీ!
Follow Us On : WhatsApp

