కలం, వెబ్ డెస్క్: స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా భారీగా డబ్బు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రిపబ్లికన్ల కోసం 500 మిలియన్ డాలర్లు (రూ.4,200 కోట్లు) ఖర్చు చేయడం తన మూర్ఖత్వమేనని మస్క్ చెప్పారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా ఆశించిన ప్రభావం చూపలేకపోయామన్నారు.
రిపబ్లికన్లకు ఆధిక్యం రావడమే లక్ష్యంగా పని చేసినా అది నెరవేరలేదని మస్క్ (Elon Musk) తెలిపారు. అమెరికాలో ఎన్నికలు కేవలం డబ్బుతోనే ప్రభావితం కావని.. మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని వెల్లడించారు. అయితే, టైమ్ వెనక్కి వెళ్లగలిగితే ఎన్నికల కోసం తక్కువ మొత్తమే ఖర్చు చేసేవాడినని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా మస్క్ మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.

