వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో అయోమయం!

కలం, వనపర్తి: జిల్లా కేంద్రంలోని (Wanaparthy) అంబేద్కర్ చౌరస్తా వాహనదారులకు నిత్యం పరీక్షగా మారింది. నాలుగు ప్రధాన రహదారులు కలిసే ఈ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ఏ వైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరు ముందు వెళ్లాలి.. ఎవరు ఆగాలి అన్నది అర్థంకాక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. రద్దీ వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల నుంచి చర్యలు కనిపించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే మేల్కొని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేదో చూడాలి!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>