పెద్దపల్లిలో మహిళల కోసం మెగా జాబ్ మేళా

కలం, పెద్దపల్లి : నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్, ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం పెద్దపల్లిలో (Peddapalli) భారీ మెగా జాబ్ మేళా (Mega Womens Job Fair) నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను పెద్దపల్లి జిల్లా బీసీజేసీ చైర్మన్ దాసరి ఉష ఈ నెల 14న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని కొంగరకలాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పట్టణంలోని శాంతినగర్‌లో గల సింధూర ఐటీఐ కాలేజీలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాకు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగి, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన మహిళలు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,851 గ్రాస్ జీతం, అన్ని మినహాయింపుల అనంతరం చేతికి రూ.17,650 వేతనం అందుతుందని పేర్కొన్నారు.

దీంతో పాటు హైదరాబాద్‌లో ఎక్కడి నుంచైనా కంపెనీకి ఉచిత ఏసీ బస్సు సౌకర్యం, రెండు పూటలా భోజనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.ఆసక్తి గల మహిళలు ముందుగా ఆన్‌లైన్ లింక్ (https://in.bigin.online/org60094690728/forms/dasari-usha) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇతర వివరాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 9240954734 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>