కలం, గద్వాల: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి బాపు రెడ్డి (Bapu Reddy) పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు.
గురువారం గద్వాల పట్టణంలోని బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు టీ. రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన (Bapu Reddy) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలు, వార్డులు, బూత్ల వారీగా పార్టీని బలోపేతం చేయాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
డిసెంబర్ 1 నుంచి 25 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా దూత్ అభియాన్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలన్నారు. యువత, మహిళలు, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ అభియాన్ను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్ ఎక్బోటే, కే.కే. రెడ్డి, శ్యామ్రావు, అసెంబ్లీ అభ్యర్థులు బలిగేరా శివారెడ్డి, రాజగోపాల్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి శ్రీను, మాజీ కౌన్సిలర్ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read : అంబానీల నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది: అనన్యా బిర్లా
Follow Us On : WhatsApp

