కాళోజీ కళాక్షేత్రానికి KUDA కార్యాలయం తరలింపు

కలం, హనుమకొండ: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(KUDA) కార్యాలయాన్ని బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తరలించారు. గతంలో హనుమకొండ ఆర్డీవో కార్యాలయం పక్కన కొనసాగిన కుడా కార్యాలయాన్ని కళాక్షేత్రంలోని రెండో, మూడో అంతస్తుల్లో ఏర్పాటు చేశారు.

నూతన కార్యాలయాన్ని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, కార్యాలయ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై కాళోజీ కళాక్షేత్రం నుంచే కుడా అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>