కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్(Obedulla Kotwal) అన్నారు. జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో గురువారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా తన హయాంలో దేశాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు. బ్యాంకులను జాతీయం చేసి ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. సామాన్యులకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చిన మహానీయురాలు ఇందిరాగాంధీ అని తెలిపారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం పాటుపడుద్దామని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఇందిరాగాంధీ జయంతి నిర్వహించారు.
కార్యక్రమంలో మేయర్ మమత, ఏఎంసీ మాజీ ఛైర్ పర్సన్ అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్ గౌడ్, టీవీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, డీసీసీ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మీడియాసెల్ కన్వీనర్ బెనహర్, నాయకులు సాయిబాబా, అజ్మత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

