పోలీసుల నోటీస్ అనుకుని వెళ్లాడు.. అక్కడే అసలు ట్విస్ట్!

కలం, వెబ్ డెస్క్: బ్రేకప్ చెప్పి దూరంగా ఉంటున్నాడన్న కక్షతో ఓ యువతి తన ప్రియుడికి షాక్ ఇచ్చింది. ఏఐ సాయంతో పోలీసుల పేరుతోనే నకిలీ నోటీసు (Fake Notice) సృష్టించి ప్రియుడిని భయాందోళను గురిచేసింది. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ యువకుడు, యువతి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ యువకుడు గత ఏడాది కాలంగా ఆమెకు దూరంగా ఉండటంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆమెను బ్లాక్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి, అతడిపై కక్ష తీర్చుకోవాలనుకుంది. దాని కోసం ఒక ప్లాన్ వేసింది. ఏఐ సాయంతో అచ్చం నిజమైన పోలీసు నోటిసులా కనిపించేలా షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసును (Fake She Teams Notice) రూపొందించింది. అనంతరం హరి అనే తన స్నేహితుడి సహాయం తీసుకుని, అతడి నంబర్ ద్వారా ఆ నకిలీ నోటీసును యువకుడి వాట్సాప్ కు పంపించింది.

వాట్సాప్ లో వచ్చిన ఆ నోటీసును చూసి యువకుడు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. అది నిజమని నమ్మిన యువకుడు విచారణ కోసం నేరుగా షీ టీమ్స్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ నోటీసులు పరిశీలించిన అధికారులు, తమ విభాగం నుంచి అలాంటి నోటీసు ఏదీ జారీ కాలేదని, అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు వెంటనే సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నకిలీ నోటీసు తయారు చేసిన యువతితో పాటు, దాన్ని పంపించడంలో సహకరించిన ఆమె స్నేహితుడు హరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>