కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా ఇళ్లకు, వాహనాలకు తాళం వేయడం చూస్తుంటాం కానీ, ఏకంగా కల్లు డబ్బాకే తాళం వేయడం వైరల్ గా మారింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి (Peddakaparthy) గ్రామంలో ఓ వృద్ధుడు కల్లు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు వినూత్న ఆలోచన చేశాడు. ఈత చెట్టు నుంచి కల్లు సేకరించే డబ్బాలను గుర్తుతెలియని వ్యక్తులు తరచూ ఎత్తుకెళ్తుండటంతో ఆయన తనదైన శైలిలో పరిష్కారం కనుగొన్నాడు.
రోజూ కష్టపడి సేకరించిన కల్లు డబ్బాలు మాయమవుతుండటంతో తాత వెంటనే రూ.500 ఖర్చు చేసి గొలుసు, తాళం కొనుగోలు చేశాడు. కల్లు డబ్బాకు గొలుసు బిగించి తాళం వేయడంతో దొంగలు డబ్బాను ఎత్తుకెళ్లడం కష్టతరంగా మారింది. తాత ఆలోచన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతూనే ఆయన చొరవను మెచ్చుకుంటున్నారు.

