కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్‌లో 22వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను (Cheyutha Pension Letters) జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అరవ లక్ష్మి రాజు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

