వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్!

క‌లం, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) మరోసారి తన సత్తా చాటాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. అయితే కిదాంబి శ్రీకాంత్ విజయంతోనే లక్ష్యసేన్‌కు ఈ అవకాశం దక్కింది. బుధవారం జపాన్ ప్లేయర్ కోకి వతనాబేతో శ్రీకాంత్ పోరాడాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-16, 16-21, 21-9తో విజయం సాధించాడు. ఫైనల్స్ బెర్త్ రేస్ నుంచి వతనాబే ఔట్ అయ్యాడు. దీంతో లక్ష్యసేన్‌కు లైన్ క్లియర్ అయింది.

అంతకుముందు లక్ష్యసేన్ ఫ్రాన్స్ ఆటగాడు ఆర్నాడ్ మెర్కెల్‌పై విజయం సాధించాడు. 14-21, 21-16, 25-23తో గెలిచి ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. లక్ష్యసేన్ 74,180 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. వతనాబే 73,620 పాయింట్లతో పోటీలో ఉన్నాడు. తాజా ఫలితంతో లక్ష్యసేన్‌కు బెర్త్ ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి 13 వరకు చైనాలోని హాంగ్జౌలో ఈ టోర్నీ జరగనుంది. లక్ష్యసేన్‌కు ఇది రెండో వరల్డ్ టూర్ ఫైనల్స్. 2021లో తొలిసారి సెమీఫైనల్ చేరాడు. తదుపరి మ్యాచ్‌లో లక్ష్యసేన్ డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ గెమ్కేతో తలపడనున్నాడు. శ్రీకాంత్ కొరియా ఆటగాడు యూ టే బిన్‌తో పోటీ పడనున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>