కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాల (Parnashala) శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో స్వామివారికి మొత్తం రూ. 20,22,606 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 18నుంచి నేటి వరకు భక్తులు స్వామివారికి మొక్కుల రూపంలో ఈ కానుకలను సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని, హుండీల ద్వారా తమ కానుకలను సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు.

