బీమా పథకం అమలుపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

కలం, నిర్మల్ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, విబి-జి రామ్ జీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, నామినీ మైనర్ అయిన పక్షంలో అపాయింటీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. శిబిరాల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

విబి-జి రామ్ జీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదిలో 125 రోజుల ఉపాధి కల్పించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించి, పనులు కోరుకునే వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సోక్‌పిట్‌ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>