ఘోర కారు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

క‌లం, వెబ్‌డెస్క్‌: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)రాష్ట్రంలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ కారు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోవ‌డంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మండి (Mandi) ప్రాంతంలోని లోయ‌ల వ‌ద్ద జ‌రిగింది. ఈ కారు లోయ‌లో ప‌డిపోవ‌డంతో దాదాపు వీరి కోసం 15 గంట‌ల పాటు సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రిగింది. చివ‌ర‌కు ఈ ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలంలో కారు పూర్తిగా ధ్వంస‌మైపోయి క‌నిపించింది.

కారులో ఆరుగురు స్నేహితులు ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల్లో ఎక్కువ మంది మైన‌ర్లే కావ‌డం తీవ్ర విచార‌క‌రంగా మారింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నం వరకు ఈ ఘటన వెలుగులోకి రాలేదు. లోయలో పడిన కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఆరుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో మండి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఆరుగురూ మృతి చెందినట్లు డీఎస్పీ పధర్ లోకేందర్ నేగి వెల్ల‌డించారు. కారు అదుపుతప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ‌స‌భ్యుల‌కు పోలీసులు స‌మాచారం అందించారు.

Also Read : మ‌రో యుద్ధానికి సిద్ధ‌మైన‌ భారత మహిళల హాకీ టీమ్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>