కలం, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న సమంత.. తాజాగా తన అత్తగారి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంది.
కాగా, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును గతేడాది డిసెంబర్లో సమంత వివాహం చేసుకుంది. వెబ్ సిరీస్లలో కలిసి పనిచేసిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథి రాక కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
Also Read : తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బ రిలేషన్ పై అఫిషియల్ ప్రకటన!
Follow Us On : WhatsApp

