సర్​ గడువు మళ్లీ పొడిగింపు

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్​) గడువును (SIR Shedule) కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న షెడ్యూల్​ లో మార్పులు చేసింది. నవంబర్​ 30వ తేదీన తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా దాన్ని డిసెంబర్​ 22 వరకు పెంచింది.

అలాగే.. ఆబ్సెంట్​, షిఫ్టెడ్​, డెడ్​, డూప్లికేట్​ (ఏఎస్​డీడీ) క్యాటగిరీ ఓటర్ల కోసం ఎన్యూమరేషన్​ ఫారాల తయారీ, ముద్రణ ప్రక్రియను నవంబర్​ 18లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్యూమరేషన్​ ఫారాల పంపిణీ, సేకరణను నవంబర్​ 18 నుంచి 30 వరకు చేపట్టాలని పేర్కొంది. సేకరించిన ఫారాల పరిష్కార ప్రకియను డిసెంబర్​ 10వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సందీప్​ కుమార్​ లేఖ జారీ చేశారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>