కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ (Balmoor Venkat) ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం లారీని బల్మూరి వెంకట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది.
అయితే, ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంతో బల్మూరి వెంకట్ దంపతులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

