భారత్ సమ్మిట్ కాదు.. కాంగ్రెస్ సమ్మిట్: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ భారత్ సమ్మిట్ (Bharat Summit) వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేటీఆర్ (KTR) కొట్టిపారేశారు. అది అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్న రాజకీయ సమ్మిట్ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడిన కార్యక్రమం కాదన్నారు. ప్రాజెక్టులు, పథకాలకు పేర్లు మార్చే రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న అన్ని ప్రాజెక్టుల పేర్లను మార్చుతామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం పేరు మార్చడం ఎందుకు?

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) తెలంగాణ రైతుల జీవన విధానాన్ని మార్చిన గొప్ప ప్రాజెక్టు అని అభివర్ణించారు. దాని పేరు మార్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరును ఇందిరమ్మ క్యాంటీన్ గా మార్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు రాదని అన్నారు. కేసీఆర్ కిట్ అత్యంత విజయవంతమైన పథకమని, అలాంటి సూపర్ హిట్ పథకానికి పేరు మార్చడమే కాకుండా పూర్తిగా ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అన్నపూర్ణ దేవత పేరు మీద ఉన్న అన్నపూర్ణ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. జయపాల్ రెడ్డి పేరు మీద కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోందని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం లేదన్నారు.

కరువును ఎందుకు పట్టించుకోవడం లేదు?

తెలంగాణలో కరువును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కరువు సహాయక చర్యలు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ.. రైతులకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. కనీసం రుణాల రీషెడ్యూల్ పై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పాలకుల వికృతి వల్ల వచ్చిన కరువన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు కేటాయించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>