కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు జట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిటెన్షన్ డే సందర్భంగా స్టార్ ఆటగాళ్ల విడుదల, ట్రేడింగ్‌లపై కీలక అప్డేట్స్ వచ్చాయి. మరోవైపు, మహేంద్రసింగ్ ధోనీ ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. 19 సీజన్ల పాటు ఐపీఎల్లో ఆడిన ధోనీ.. 278 మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు చేశాడు. సీఎస్కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. 2027 సీజన్ నుంచి మెంటార్‌గా జట్టుతో కొనసాగనున్నాడు.
రిటెన్షన్ జాబితాల ప్రకారం.. కేకేఆర్ పతిరణ, ముస్తాఫిజుర్ రెహమాన్, రచిన్ రవీంద్రలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ, లక్నో, సన్‌రైజర్స్ జట్లలోనూ పలువురు ఆటగాళ్లను వదులుకునే అవకాశముంది. మరోవైపు ట్రేడింగ్లలోనూ కీలక మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు, అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు మారనున్నారు.
రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు, కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లనున్నారు. హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్‌కు, మహమ్మద్ షమీ రాజస్థాన్ రాయల్స్‌కు మారనున్నారు. మరికొందరు ఆటగాళ్ల బదిలీలూ ఖరారయ్యాయి. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌కు నవంబర్ 23 చివరి తేదీ కాగా.. తుది జాబితాను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు.

