గ‌ద్వాల‌లో పిల్ల‌ల ప్రజావాణి.. క‌లెక్ట‌ర్‌కు 40 ఫిర్యాదులు

కలం, జోగులాంబ గద్వాల: బాలల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన పిల్లల ప్రజావాణి (Childrens Prajavani) దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు మందిరంలో సాధారణ ప్రజావాణితో పాటు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల ప్రజావాణికి ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్లు, మరుగుదొడ్ల, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదులు అందాయన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణికి వచ్చిన ఆర్జీల్లో ఇంకా 73 పెండింగ్ లో ఉన్నందున త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈవారం వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 40 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఈనెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని, అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా చేయూత పెన్షన్లకు అర్హులైన వారందరికీ మంజూరు పత్రాలను సంబంధిత ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>