ధర్మ దీక్షలకు 2.15 లక్షల మంది CPS ఉద్యోగుల పిలుపు

కలం, వెబ్ డెస్క్: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగులు (Telangana CPS Employees) రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ధర్మ పోరాటానికి పిలుపునిచ్చారు. పాత పెన్షన్ స్కీమ్(OPS)ను పునరుద్ధరించాలని నవంబర్ 17న సీపీఎస్ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టనున్నారు. ఈ మేరకు వారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలకు 45,000 మందిని మినహాయించి, మిగతా 2.15 లక్షల మంది ఉద్యోగులు ఈ సామూహిక సెలవులో పాల్గొంటారని స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ దీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

తమ వేతనాల్లో పెన్షన్‌ కోసం 10 శాతం, హెల్త్ స్కీం కోసం మరో 1.5 శాతం కోత విధిస్తున్నా.. పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన పెన్షన్, వైద్య భద్రత లభించడం లేదని సీపీఎస్‌ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 5 వేల మందికి పైగా సీపీఎస్‌ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని.. వారిలో ఎవరికీ రూ.5 వేల పెన్షన్‌ కూడా రావడం లేదని వాపోయారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ ను పునరుద్ధరించేవరకు టీఎస్‌సీపీఎస్‌ఈయూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>