పునరావాసం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటే తిరుగుబాటే: చత్రునాయక్

కలం, అచ్చంపేట : పునరావసం పేరుతో గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటే తిరగబడతామని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్, మాజీ సర్పంచ్ వి. చత్రునాయక్ హెచ్చరించారు. ఆయన సోమవారం అమ్రాబాద్ మండలంలోని వటువర్లపల్లి (Vatvarlapally) గ్రామంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. పునరావాసంపైన నిజ నిర్ధారణ కోసం వచ్చిన CLC (పౌర హక్కుల సంఘాలు) తప్పుడు నివేదికలు ఇచ్చారని పునరావాస కమిటీ ఆరోపించడం, వారి ఇల్లను ముట్టడిస్తామని ప్రశ్నించడం ఎంతవరకు సబబు అని అన్నారు. స్వచ్ఛంద పునరావాసం పేరుతో తమ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాల భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని, ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరిందన్నారు. ఇప్పటికైనా సకాలంలో పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులు పునరావాసం కోరుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ 40 ఏళ్ల క్రితం గ్రామం విడిచి వెళ్లిన వారికి కల్పించి ప్రజాధనం లూటీ చేసేందుకు అటవీ శాఖ అధికారులు పునరావాస కమిటీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గ్రామంలో 400 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్న ఇక్కడే అందరం ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరియానాయక్, మాజీ వార్డు సభ్యులు భరత్, రమేష్ గ్రామస్తులు సోమనాథ్, ప్రభాకర్ సత్తి, అంజయ్య, వెన్నుపోతుల భవాని, రవికుమార్, రాజు నాయక్, శివ ప్రసాద్, సాయి శ్రీశైలం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>