వనపర్తిలో బాలల సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి

కలం, వనపర్తి: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బాలల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి (Students Grievances) నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధారం గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

అలాగే చాకల్‌పల్లి విద్యార్థినులు గోపాల్‌పేట పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని, లేదంటే సైకిళ్లు పంపిణీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుజరాత్‌లో నిర్వహించిన ఏకతా దివస్ కార్యక్రమానికి జిల్లా నుంచి ఐదుగురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పంపించినందుకు సోలిపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రణధీర్, లోకేష్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యటన అనుభవాలను వివరించారు.

విద్యార్థులు స్వయంగా రూపొందించిన తల్లిదండ్రుల అనుబంధాన్ని తెలిపే చిత్రపటాలను కలెక్టర్‌కు బహూకరించారు. ఇదిలా ఉండగా, సాధారణ ప్రజావాణిలో 56 ఫిర్యాదులు, ఆర్డీఓ ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రామ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>