తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92వేల మందిపై కేసుల ఎత్తివేత

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సర్కార్ (Tamil Nadu Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గతంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కలిగించింది. 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో రైతులు, ఉపాధ్యాయులు తమ హక్కులు, జీవనోపాధి, ఇతర న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుత ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకోనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం విజయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ నిర్ణయంతో 92 వేల మంది రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులు కొట్టివేయనున్నారు. తిరువణ్ణామలై జిల్లాలో సిప్‌కాట్ పారిశ్రామిక వాడకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు, పరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన రైతులపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. కేసుల ఉపసంహరణకు సంబంధించి అవసరమైన చట్టపరమైన ప్రక్రియను అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

పెండింగ్ కేసుల విషయంలో సంబంధిత న్యాయస్థానాల్లో అవసరమైన అనుమతులు, ప్రక్రియలను ప్రభుత్వం (Tamil Nadu Govt) అనుసరించాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య హక్కులను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచుతుందని ముఖ్యమంత్రి విజయ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>