కలం, సినిమా: టాలీవుడ్ దివంగత నటుడు శ్రీహరి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి (Shashank Srihari) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో, ఫ్రెండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శశాంక్ శ్రీహరి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక నవంబర్ 20న జరగనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.
కాగా టాలీవుడ్ హీరోగా, విలన్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు నటుడు శ్రీహరి, మగధీర మూవీలో షేర్ ఖాన్‌టగా టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. దాదాపు వందల సినిమాల్లో నటంచి ఆయన 2013లో కన్నుమూశారు. సినిమాల్లో ఉన్నప్పుడే నటి డిస్కోశాంతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గులు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

