కార్తీక సోమవారం.. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ

కలం, వెబ్ డెస్క్: కార్తీక సోమవారం (Karthika Somavaram) పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కీసరగుట్ట, హనుమకొండలోని వేయిస్తంభాలు, రామప్ప ఆలయాల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అత్యంత ప్రీతిప్రాతకరమైందిగా ప్రతీతి. శివార్చన చేయడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి, మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు చేసే పనిలో విజయమే లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచే అన్ని శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా చోట్ల ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఏపీలో పోటెత్తిన భక్తులు..

ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని అనేక శివాలయాల్లో కూడా ఇదే తరహాలో రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం నేపథ్యంలో.. శైవ క్షేత్రాల పరిసరాలు దీపాల కాంతుల్లో వెలిగిపోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>