కోలుకుంటున్న రాప్తాడు చిన్నారి.. మంత్రి లోకేశ్ కీలక అప్‌డేట్

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో ఇటీవల జరిగిన ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. నేడు చిన్నారి తాజా హెల్త్ అప్‌డేట్‌ను ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ధైర్యవంతురాలైన చిన్నారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, ఎలాంటి కృత్రిమ ఆక్సిజన్ అవసరం లేకుండా సహజంగానే ఆక్సిజన్ స్థాయిలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

సర్జరీ అనంతరం చిన్నారి వేగంగా కోలుకుంటోందని, ప్రస్తుతం నోటి ద్వారా ఆహారాన్ని చక్కగా తీసుకుంటోందని నారా లోకేశ్ తెలిపారు. అంతేకాకుండా, ఇతరుల సాయంతో చిన్నారి నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించిందని, ఆమె కోలుకునే క్రమంలో ఇదొక అద్భుతమైన ముందడుగు అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం చిన్నారిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఫిజియోథెరపీ, అవసరమైన రీహాబిలిటేషన్ సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. చిన్నారికి అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి, ఆమె త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>