కలం, సినిమా: వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు దుల్కర్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారని ప్రశంసించారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ ఇలా ఆయన విజయాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయన వెర్సటైల్ యాక్టర్ అని, ఆయన సినిమాల ఎంపిక కూడా చాలా బాగుంటుందని చెప్పారు. ఆకాశంలో ఒక తార ఆయన కెరీర్లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందని చెప్పారు. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్ చెప్తూ వెల్ కం టు తెలుగు సినిమా అని స్వాగతించారు. శ్రుతి హాసన్ లాంటి కమర్షియల్ స్టార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతారామం’ తర్వాత ఈ కథ విన్నాను. కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించింది. కచ్చితంగా ఇది నా కెరీర్లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. స్వప్నకు, అల్లు అరవింద్ గారికి థాంక్యూ. అల్లు అరవింద్ గారు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తారు. ఆయన ఎంతో ఎనర్జీగా ఉంటారు. బహుశా బన్నీ గారు కూడా అంత ఎనర్జీగా ఉండటానికి కారణం అరవింద్ గారే. గుణ్ణం గంగరాజు గారికి థాంక్యూ. వారితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలాగే రాజ్‌కుమార్, మహేశ్‌లతో కలిసి పనిచేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. శ్వాసిక మా అక్క పాత్రలో కనిపిస్తుంది. రుహాని బిజిలి పాత్రలో కనిపిస్తుంది. మొదటి షెడ్యూల్లో రుహాని గారితోనే కలిసి పనిచేశాను. జీవీ ప్రకాష్ ఈ సినిమా కథ విన్నప్పుడే బ్లాక్‌బస్టర్ అని చెప్పారు. తను ఒక సినిమా బాగుందని చెప్పాడంటే కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని నాకు తెలుసు. అలాంటిది ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పడం నాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది. డైరెక్టర్ పవన్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో పనిచేశారు. ‘ఆకాశంలో ఒక తార’ కచ్చితంగా మనమందరం గర్వపడే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.. అన్నారు.

