కలం, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ డిజిటల్ మీడియా రిపోర్టర్స్ యూనియన్ (DMRU) ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలో జడ్చర్ల అధ్యక్షుడిగా మహ్మద్ మక్సూద్ ఆలీ (Mohammed Maqsood Ali) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడుగా కిషన్ నాయక్, కార్యదర్శిగా గోపి, కోశాధికారిగా సయ్యద్ ఫరూక్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రచార కార్యదర్శులుగా మండ్ల స్వామి, రుక్నుద్దీన్, సంయుక్త కార్యదర్శులుగా మోహన్ నాయక్, రమేష్, సహాయ కార్యదర్శిగా వినయ్ కుమార్, సభ్యులుగా మహ్మద్ ఇంతియాజ్, మహేందర్, రాములు ఎన్నికైనట్లు అధ్యక్షులు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహ్మద్ మక్సూద్ ఆలీ మాట్లాడుతూ.. జడ్చర్లలో డీఎంఆర్ యూనియన్ను నూతనంగా స్థాపించడం జరిగిందన్నారు. యూనియన్ అభివృద్ధికి, డిజిటల్ మీడియా రిపోర్టర్ల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరితో కలిసికట్టుగా పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, సతీష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

